న్యూఢిల్లీ: కెనడా-అమెరికా సరిహద్దు ప్రాంతంలో భారత దేశానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఎమర్సన్ ప్రాంతం వద్ద కెనడా భూభాగంలో ఓ పురుషుడు, స్త్రీ, ఒక టీనేజర్, ఒక శిశువు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వెంటనే వారు భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. కెనడా భూభాగం నుంచి అమెరికా గడ్డపైకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచు ధాటికి వారు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన జైశంకర్ ఆయాదేశాల్లో ఉన్నటువంటి భారత రాయబారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిని గుర్తించాలని.. అదే విధంగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 09:46PM