బెంగుళూరు : దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు మంకీ ఫీవర్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. జ్వరంతో ఆస్పత్రికి చేరిన మహిళకు సంబంధిత లక్షణాలు ఉండడంతో వైద్యులు పరీక్షలు చేశారు. దాంతో మంకీ ఫీవర్ అని తేలింది. తీర్థహళ్లీ జేసీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
మంకీ ఫీవర్ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు దీని లక్షణాలు.
Mon Jan 19, 2015 06:51 pm