అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. గత కొన్నిరోజులుగా నిత్యం 10 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేకపాటి నిన్న ఏపీ సీఎం నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మేకపాటి స్పందించారు. తనకు కొవిడ్ సోకిందని వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm