హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. 8,9,10 తరగతులకు ఆన్‌లైన్‌తో తరగతులు నిర్వహిస్తారు. 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు కావాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పండుగ తరువాత పున: ప్రారంభం కావలసిన పాఠశాలలకు కరోనా కారణంగా ఈ నెల చివరాఖరు వరకు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm