హైదరాబాద్ : రాబోయే మూడేండ్ల కాలానికి ప్రజా పోరాటాలకు రూపకల్పన చేసే బృహత్తర కార్యక్రమానికి సీపీఐ (ఎం) రాష్ట్ర మూడో మహాసభ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో ఆదివారం అరుణ పతాకావిష్కరణతో ప్రతినిధుల సభ ప్రారంభం అయింది. అమర వీరుల స్ఫూపానికి నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు అరుణాంజలి ఘటించారు. అనంతరం ప్రతినిధుల సభనుద్దేశించి సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తారు. ఆదివారం నుంచి మంగళవారం వరకూ కొనసాగే ప్రతినిధుల సభకు వేదికైన తుర్కయాంజాల్ అరుణారుణ వర్ణాన్ని పులుముకున్నది. ఎర్రజెండాలు, తోరణాలతో ఇప్పటికే పరిసర ప్రాంతాలన్నీ ముస్తాబయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా శనివారం ఆన్‌లైన్ వేదికగా బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm