హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు. 'దేశనాయక్ దివస్‌ను అత్యంత వైభవోపేతంగా యావత్ దేశం జరుపుకొనేందుకు వీలుగా నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దేశభక్తి, ధైర్యం, నాయకత్వం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక బోస్. అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూనే బోస్ 125వ జయంతిని దేశ్ నాయక్ దివస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోంది. అలాగే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో నేతాజీ్ణపై ఒక టేబుల్‌ని ప్రదర్శిస్తారు. మన దేశానికి స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరాన్ని గుర్తుచేసుకోవడానికి బెంగాల్‌కు చెందిన ఇతర ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులను కూడా ప్రదర్శిస్తారు. నేతాజీ స్మారకార్థం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్‌తో జాతీయ యూనివర్శిటీ, 100 శాతం రాష్ట్ర నిధులతో జై హింద్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాము.` అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm