కరీంనగర్: హెల్మెట్ పెట్టుకోలేదు అని కానిస్టేబుల్ అన్నందుకు ఆయనపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్ సమీపంలో ఓ యువకుడు పోలీస్ వాహనంపై ప్రయాణిస్తున్నాడు. దాంతో ఓ కానిస్టేబుల్ అతన్ని ఆపి హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావంటూ ప్రశ్నించాడు. దాంతో ఆ వ్యక్తి.. నా ఇష్టం అని తననే ఆపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. చుట్టుపక్కల వాళ్లంతా కలిసి ఆపినా ఆగకుండా కానిస్టేబుల్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ దాడికి దిగాడు. అతని స్నేహితుడు వారించినా వినలేదు. దాంతో పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. అయితే ఆ వ్యక్తి సీఐ కుమారుడని చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm