లక్నో: యూపీలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపొడగరిగా గుర్తింపు పొందిన 8.1 అడుగుల ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తాజాగా అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ దేశంలో పొడుగు వ్యక్తి. ఆయన మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ విధానాలు, అఖిలేష్ యాదవ్ నాయకత్వం నచ్చి ఆయన పార్టీలో చేరినట్టు చెప్పారు. అలాగే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తమ పార్టీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm