హైదరాబాద్ : ఆస్ట్రేలియన్ ఓపెన్లో భాగంగా మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో సానియా మీర్జా-రాజీవ్ రామ్(అమెరికా) జోడీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్లో మాట్వే మిడిల్కూపా(నెదర్లాండ్స్)-ఎల్లెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా) జోడీని 7-6(4)-6-4 తేడాతో సానియా జోడి ఓడించింది. మొదటి సెట్ లో రెండు జోడీలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి సానియా ద్వయం మొదటి సెట్ను కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్లో పూర్తి ఆధిపత్యం వహించి కైవసం చేసుకున్న సానియా-రామ్ జోడి క్వార్టర్స్ చేరుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm