అమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీ డైరెక్టర్, డీడీవోలు, ట్రెజరీ అధికారులు పీఆర్సీ అమలుపై దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 లోగా వేతన బిల్లులు రూపొందించి సీఎఫ్ఎంఎస్ కు పంపాలని తెలిపారు. ప్రతిరోజు పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నివేదిక అందించాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కొత్ పీఆర్సీ తమకు ఆమోదం యోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలన్న ఉద్యోగుల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm