హైదరాబాద్ : ప్రయివేటు విమానయాన కంపెనీ 'గో ఫస్ట్` రిపబ్లిక్ డే సందర్భంగా ఆకట్టుకునే ఆఫర్ ను తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా రైట్ టూ ఫ్లై పేరుతో రూ.926కే విమాన ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు ప్రయాణికులు జనవరి 27 లోపు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని గో ఫస్ట్ సంస్థ సూచించింది. బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఫిబ్రవరి 11, 2022 నుంచి మార్చి 31, 2022 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ టిక్కెట్‌పై విమాన ప్రయాణం చేస్తూ 15 కేజీల లగేజీ బ్యాగ్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం వన్ వే మార్గాలకు మాత్రమే ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm