హైదరాబాద్ : ముంబైలో దారుణం చోటుచేసుకుంది. కేటరింగ్ పనులకు వెళ్లివస్తున్న యువతిపై సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. శివాజీ నగర్ లో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కొందరు మహిళలు కేటరింగ్ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో నిందితుల్లో ఒకడు వచ్చి ఓ యువతిని మాట్లాడాలంటూ పక్కకు తీసుకెళ్లాడు. అక్కడ తన ముగ్గురు స్నేహితులతో కలసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అందులో మైనర్లు కూడా ఉన్నారు. అనంతరం ఆమెను అక్కడ వదిలేసి వారంతా పారిపోయారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి తెలియజేసింది. తర్వాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం రైలులో పారిపోవడానికి ప్రయత్నిస్తోన్న ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. వారిని విచారించిన తర్వాత ఇంకొక వ్యక్తి దొరికాడు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 04:37PM