అమరావతి : ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే నలుగురు మృతి చెందగా 3,969 మంది కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ర్ట వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,77,739 కాగా అందులో 20,79,587 మంది కోలుకున్నారు. అలాగే 14,542 మంది మరణించారు.
Mon Jan 19, 2015 06:51 pm