నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వాగు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని సుమారు 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి శవాన్ని వదిలేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఉదయం వేళ అటుగా వెళ్తున్న స్థానికులకు కనకాపూర్ వాగులో శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. తలపై బలమైన గాయం ఉన్న కారణంగా ఇతర ప్రాంతంలో హత్య చేసి శవాన్ని బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు భావిస్తున్నారు. శవానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm