నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నాగారం ప్రాంతానికి చెందిన విశాల్(21) రాజులు(21) పల్సర్ బైక్ పై అర్ పి రోడ్ నుంచి గాంధీ చౌక్ వైపు వెళుతున్నారు. అయితే రోడ్డు పక్కకు చిన్నపాటి నీటి కుంట ఉండడంతో అది వారు గుర్తించలేదు. అందులోంచి బైక్ తో వారు వెళ్లడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొన్నారు. దాంతో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1 టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 06:42PM