న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మా మంత్రి సత్యేంత్ర జైన్‌ను ఇంట్లో ఈడీ అధికారులు ఇప్పటికే సోదాలు చేశారన్నారు. వారిని ఈడీ అధికారులు త్వరలో అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉందని తెలిపారు. తాము సత్యం ఆధారంగా, న్యాయబద్ధంగానే పనిచేస్తామని పేర్కొన్నారు. తనతో సహా ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసినా మేము సిద్ధమయ్యామని, తాము భయపడేది లేదన్నారు.
తాము సీఎం చన్నీలా ఏడవమన్నారు. అతను నిజంగా తప్పు పనులు చేసాడు కాబట్టి భయపడ్డాడు అన్నారు. ఈడీ అధికారులు పెద్దపెద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారని.. 11 రోజుల క్రితం ఏం జరిగిందో పంజాబ్ ప్రజలు చూశారన్నారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి తాము భయపడం అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 06:56PM