హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యువతి హల్‌చల్ సృష్టించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగితో యువతి దురుసుగా ప్రవర్తించింది. మద్యం మత్తులో దుర్భాషలాడుతూ ఉద్యోగిపై దాడికి యత్నించింది. యువతిని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm