హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెటెస్ట్ మూవీ ‘లైగర్’. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను ఒడిశాకు చెందిన సైకత శిల్పి.. దశరథ్ మొహంతా ఒడిశా రాష్ట్రంలో చెక్కారు. ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల ఫేస్‌లతో రెడీ చేసిన ఇసుక ఆర్ట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 04:06PM