అమరావతి: ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తే తమ వైపు నుంచి.. ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగమే కమిటీ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జీవోలు అబయన్స్‌లో పెట్టి, కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని, అయితే మంగళవారం మరోసారి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm