అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు తగ్గేదే లేదని తేల్చేశాయి. ముందు నుంచి చెబుతున్నట్టే సమ్మె నోటీసులను ప్రభుత్వానికి అందజేశారు. తాము ఎందుకు సమ్మె చేయాల్సి వస్తోంది. సమ్మె విరమించుకోవాలి అంటే తమ డిమాండ్లు ఏంటి వివరిస్తూ మూడు పేజీలతో కూడిన నోటీసులు ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం 12 ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతకాలు చేసి ఆ నోటీసు అందజేశారు. అయితే సీఎస్ సమీర్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జీఏడీ కార్యదర్శి శశిభూషన్ కు తమ నోటీసులు అందించారు. వచ్చే నెల ఆరోతేదీ అర్థ రాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు తమ ఉద్యమ కార్యచరణను కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు నోటీసులు ఇవ్వడంపైనా సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. తాము హైకోర్టులో పిటిషన్ వేయలేదని.. వ్యక్తిగత పిటిషన్ కు తాము హాజరవ్వాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే నిరవధిక సమ్మె నుంచి వెనక్కు తగ్గేదే లే అని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పేశాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 04:32PM