కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది. #TravelInTSRTC @TSRTCHQ @VenkyMama @RanaDaggubati @SBDaggubati @baraju_SuperHit @MilagroMovies @dpveu_official @TrackTwood @iamvictoryvenky @SimranbaggaOffc @smitapop @SureshProdns #publictransport pic.twitter.com/YnPoH6MPiL
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 16, 2022
హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వాటిని షేర్ చేస్తుంటారు. అలాగే పలు సినిమాలకు సంబంధించి మీమ్స్ పెడుతూ ఆర్టీసీపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన.. వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో హీరో కుటుంబం ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వీడియో క్లిప్ ను ఇటీవల షేర్ చేశారు. 'కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది.` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు సజ్జనార్. ఇది నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ కి పబ్లిసిటీ కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.