హైదరాబాద్ : ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు టాలీవుడ్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య ఉన్నాయి. అయితే కరోనా వేవ్ తగ్గకపోవడంతో మరో సినిమా కూడా వాయిదా పడింది. అదే అడవి శేష్ నటిస్తున్న 'మేజర్`.
26/11 టెర్రరిస్ట్ దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కావాల్సి ఉంది. అయితే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా భారత దేశం కోసం తీసిందని కావున దేశం మొత్తం పరిస్థితులు బాగయ్యాక ఈ సినిమను విడుదల చేస్తామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 04:43PM