హైదరాబాద్ : గోదావరి యాజమాన్య బోర్డు సబ్ కమిటీ సమావేశం ముగిసింది. బోర్డు మెంబర్ సెక్రటరీ పాండే అధ్యక్షతన సబ్ కమిటీ వర్చువల్ గా భేటీ అయింది. రాష్ట్రం తరఫున సీఎంవో ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా ఇతర అధికారులు హాజరయ్యారు.
తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ.. ఏపీలోని వెంకటనగరం లిఫ్ట్ పై సమావేశంలో చర్చ జరిగింది. పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టు ఇవ్వబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గెజిట్ లోని రెండో షెడ్యూల్ లో గల కాళేశ్వరం బ్యారేజీలతో పాటు మిగతా ప్రాజెక్టులు మూడో షెడ్యూల్ లోకి మార్చాలని కోరింది. తాము ఇచ్చిన డీపీఆర్ లపై నిర్ణయం తీసుకుని ప్రాజెక్టు ల అనుమతి తేలేవరకు గోదావరి ప్రాజెక్టులపై చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 06:10PM