హైదరాబాద్ : కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. ఈ సవరణలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లు ప్రధానికి లేఖలు రాశారు. తాజాగా ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 06:56PM