హైదరాబాద్ : పెండ్లి కావడం లేదని పూజారి వద్దకు వెళ్లిన యువతికి అతను మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. నగరంలో జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడలో నివసించే ఓ యువతి తనకు పెండ్లి కావడం లేదని స్థానికంగా ఉండే ఓ పూజారి వద్దకు వెళ్లింది. తనకు పెండ్లి కావడం లేదని ఏవైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పాలని కోరింది. దాంతో పూజారి ఆమెకు మంచి సంబంధాలు చెబుతానని మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తర్వాత పెండ్లి చేసుకుంటానని ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. చివరికి పెండ్లి చేసుకోవాలని యువతి గట్టిగా నిలదీయగా అతను పరారయ్యాడు. దాంతో బాధితురాలు తన కుటుంబసభ్యులతో ఆ పూజారి ఇంటి ముందు ధర్నా చేపట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm