హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 97,113 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,980 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ముగ్గురు మృతి చెందగా 2,398 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 33,673 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ర్ట వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీలో 1,439 కరోనా కేసులు నమోదయ్యాయి.