హైదరాబాద్ : రూ.500 కోసం ఇద్దరు హెల్త్ వర్కర్లు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన
బిహార్‌లోని జమౌ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్‌లోని ప్రాథమిక కేంద్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. నవజాత శిశువుకు బీసీజీ టీకా కోసం ఆశా కార్యకర్త రింటు కుమారి పీహెచ్‌సీకి తీసుకొచ్చింది. అక్కడ ఏఎన్ఎం రంజన కుమారి టీకా వేయడానికి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో ప్రసూతి వార్డు సమీపంలో ఆశా కార్యకర్త ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతో పాటు జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. అనంతరం ఓ వ్యక్తి వారి విడిపించాడు. అయితే కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలయింది. అధికారులు దీనిపై తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. దీనిపై విచారణకు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 08:51PM