హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి ఆత్మహత్యలపై పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి.
కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవాలని ఒక నెల ముందు నుంచే ప్లానింగ్ చేసుకున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఎలా చనిపోవాలో ఒక నెల ముందు నుంచే నెట్‌లో శ్రీకాంత్ వెతికినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే శ్రీకాంత్ ఫోన్ డేటా కొన్ని క్లూస్‌ను అందించింది. కరోనా వల్ల శ్రీకాంత్ ఉద్యోగం చేయకుండా కొన్ని నెలల పాటు ఉండడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. తర్వాత ఒక నెల కిందనే శ్రీకాంత్ ఓ ఎంఎన్సీ కంపెనీలో చేరినట్టు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీకాంత్‌కు అప్పు తీసుకున్న ఫైనాన్షియర్ల నుంచి చాలాసార్లు ఫోన్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వారికి నుంచి ఒత్తిడి పెరగడంతో తన దగ్గర డబ్బులు లేవని శ్రీకాంత్ వాళ్లకు ఈమెయిల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ ఇంట్లో ఉన్న దేవుడి బొమ్మలు బోర్లించి ఉండటం.. వారి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండటం లాంటి విషయాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2022 09:34PM