అమరావతి: తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ జింక చనిపోతూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 7వ మైల్‌స్టోన్ సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. అప్పటికే నిండు గర్భంతో ఉన్న ఆ జింక చనిపోతూ పిల్లకు జన్మనిచ్చింది. అది చూసిన భక్తుల మనసులు ద్రవించిపోయాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, టీటీడీ అధికారులు జింకపిల్లను ఎస్వీ జూకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm