హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదని ఇప్పటికే పలువురు యువకులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఏదైనా సరే బతికి సాధించుకోవాలని నాయకులు, మానసిక నిపుణులు చెబుతున్నా ఆత్మహత్యలు ఆగడంలో లేదు. తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఓ యువకుడు బలవన్నరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడిది పేద కుటుంబం. ఎలాగైనా ఎస్సై ఉద్యోగం సాధించిన తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. కోచింగ్ తీసుకున్నాడు. మూడేండ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఎంత ఎదురుచూసిన నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2022 10:59AM