హైదరాబాద్ : ఓ నాలుగేండ్ల బాలిక తాను మళ్లీ పుట్టానంటూ హల్ చల్ చేస్తోంది. తాను గత జన్మలో ఎవరో చెబుతూ.. తాను ఎలా మరణించాను అనేది కూడా చెబుతోంది ఆ బాలిక. ఆమె చెప్పిన విషయాలపై ఆరా తీస్తే అన్నీ నిజమేనని తెలిసింది. దాంతో ఇది చర్చనియాంశమైంది.
రాజస్థాన్‌లోని పారావాల్ గ్రామానికి చెందిన దుర్గ, రతన్‌సింగ్ చుందావత్ దంపతులు. రతన్‌సింగ్ చుందావత్ లాడ్జిలో పనిచేస్తుంటాడు. వారికి ఐదుగురు కుమార్తెలు. వారిలో నాలుగేండ్ల కింజల్.. ఏడాది క్రితం తన సోదరుడు ఎక్కడంటూ తండ్రి రతన్‌సింగ్‌ను అడిగింది. అయితే, ఆమె మాటలను రతన్‌సింగ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ బాలిక అలానే అడిగేది. ఒక రోజు బాలిక తాను మళ్లీ పుట్టానని, గత జన్మలో ఎలా మరణించిందో చెప్పింది. అప్పట్లో తన తల్లిదండ్రులు, సోదరుడి గురించి చెబుతూ వారి పేర్లను కూడా చెప్పింది. అప్పట్లో తన పేరు ఉష అని, 2013లో పిప్లాంత్రి అనే గ్రామంలో ప్రమాదశాత్తు మంటల్లో కాలిపోయి చనిపోయానని చెప్పింది. దాంతో కుమార్తె మానసిక అనారోగ్యం సరిగ్గా లేదని భావించి ఆమెను వైద్యులకు చూపించారు. అయితే పరీక్షల్లో ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. దాంతో అనుమానమొచ్చిన బాలకి తలిదండ్రులు బాలికను వెంటపెట్టుకుని ఆమె చెబుతున్న పిప్లాంత్రి అనే గ్రామానికి వెళ్లారు. వీరుంటున్న గ్రామానికి అది 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
అక్కడ బాలిక తన గత జన్మ తల్లిదండ్రులను గుర్తించింది. తన ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారని వారి పేర్లతో సహా అడిగి తెలుసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తాను చనిపోయానంటూ చెప్పింది. ఉషా అనే మహిళ అలాగే చనిపోవడం, బాలిక చెబుతున్న మాటలు నిజమే కావడం ఇరు కుటుంబాలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చారు. దాంతో రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది.
బాలిక ప్రస్తుతం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే గత జన్మలోని తన తల్లిదండ్రులు అని చెబుతున్న వారితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతోంది. తనకన్నా వయసులో పెద్దవారైన వారిని తన పిల్లలు అని చెబుతున్న వారి గురించి తెలుసుకుంటోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2022 11:16AM