ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకోగా.. మంగళవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు... ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 57,858కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 17,278కి పెరిగింది. మారుతి సుజూకి, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఇండస్ఇండ్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాలు గడించాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహింద్రా, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్ట పోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm