హైదరాబాద్ : చర్చిలో సిస్టర్ ను పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ చర్చి ఫాదర్ మోసం చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంట హోసన్నా చర్చిలో ఓ యువతి సిస్టర్ గా ఉంటోంది. అదే చర్చిలో నటానియేలు అనే వ్యక్తి ఫాదర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదు నెలల క్రితం ఫాదర్ దారా నటానియేలు.. ఆ యువతిని పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరికంగా దగ్గరయ్యాడు. అనంతరం యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా అతను ముఖం చాటేశాడు. తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm