హైదరాబాద్ : మెదక్ జిల్లా ఎడుపాయల వన దుర్గామాత అమ్మవారి ఆలయంలో హుండీ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఎడుపాయల ఆలయంలో హుండీ చోరి చేసిన నిందితుడు లక్ష్మారెడ్డిని
హైదరాబాద్ లోని శంకర్ పల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడు దగ్గర నుంచి 7.5 తులాల బంగారం, 250 గ్రాముల వెండి, 2లక్షల 86 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm