మహబూబ్‌నగర్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దేవరకద్ర మండలం పెద్ద గోపాల్‌పూర్ దగ్గర జాతీయ రహదారిపై బస్సు, బొలేరో వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm