హైదరాబాద్: ప్రతి ఏటా పోలీస్ శాఖలో పనితీరు ఆధారంగా కేంద్రం ప్రకటించే పతకాలలో రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌తో పాటు మెరిటోరియస్ సేవా పతకాలు లభించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ పతకాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు అధికారులకు పీపీఎమ్ (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్) దక్కగా, మరో 11 మంది అధికారులు, సిబ్బందికి మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్ దక్కాయి.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కేంద్ర సాయుధ బలగాలు, ఇతర విభాగాల్లోని అధికారులు సిబ్బందికి కూడా పలు పతకాలు దక్కాయి. రాష్ట్ర పోలీస్ శాఖలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో ఇబ్రహీంపట్నం కమాండెంట్‌గా పనిచేస్తున్న చాకో సన్నీతో పాటు పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ జి.శ్రీనివాసరాజు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ను దక్కించుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కింద సీనియర్ ఐపీఎస్, ఐజీ హోదాలో మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న షానావాజ్ ఖాసీంతో పాటు సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీగా పనిచేస్తున్న సంక్రాంతి రవికుమార్, ములుగు ఓఎస్డీ పుల్ల శోభన్‌కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రాయప్పగారి సుదర్శన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ పోలగాని శ్రీనివాస్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డీఎస్పీ జి.శ్రీనివాసులు, వనపర్తి డీఎస్పీ కేఎమ్ కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఆర్‌ఎస్‌ఐ మహ్మద్ యాకుబ్ ఖాన్, డిచ్‌పల్లి బెటాలియన్ ఏఆర్‌ఎస్‌ఐ బండి సత్యం, గ్రేహౌండ్స్ ఏఆర్‌ఎస్‌ఐ మెట్టు వెంకటరమణరెడ్డి, కొండాపూర్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఇలపంద కోటేశ్వర్‌రావుకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కింద పోలీస్ పతకా>లు దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, ఏపీకి చెందిన భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Jan,2022 07:08AM