హైదరాబాద్: గృహప్రవేశం చేసిన కొద్దిసేపటికే బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన రచిత్ బర్ధియా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రోడ్డు నెంబరు 86లో ఇల్లు కొనుగోలు చేశారు. ఈనెల 23న గృహప్రవేశం చేశారు. బంధువులు, పనివారు వెళ్లిపోయాక బెడ్రూంలోకి వెళ్లి చూడగా కప్బోర్డు తెరిచి ఉంది. పరిశీలించగా అందులో ఉండాల్సిన 10 తులాల బంగారు నెక్లెస్, చెవి కమ్మలు కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm