హైదరాబాద్ : రైలు ప్రయాణం చేసే వారికి ముఖ్య గమనిక. రైళ్లలో కొత్త నియమాలను తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే జైలుకు కూడా పంపించనున్నారు.
ఇకపై రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌ట్యాప్, మొబైల్‌ఫోన్‌లలో పెద్దగా శబ్దం వచ్చేలా పాటలు వంటివి పెట్టకూడదు. దాని వల్ల ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఫోన్‌లో గట్టిగా మాట్లాడరాదు. సాధారణ తరగతుల్లో ప్రయాణం చేసే వారు కూడా రాత్రి పది గంటల వరువాత గట్టిగా మాట్లాడటంపై నిషేధం విధించారు. ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు రైల్వేశాఖ ఈ నిబంధనను రూపొందించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. రైళ్లలో ప్రయాణం చేసే తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ బాధ్యతలను ఆర్పీఎఫ్‌కు అప్పగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు, రాత్రి 10 గంటల తరువాత అన్ని బోగీల్లో లైట్లు తప్పనిసరిగా ఆర్పేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణం సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 139 నెంబర్‌కు కాల్ చేయాలని రైల్వేశాఖ తెలిపింది. ఇకపై రైళ్లలో నిరంతరం రైల్వే సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేలు ఇలాంటి నియమాలు రూపొందించాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jan,2022 01:11PM