హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు(94) కన్నుమూశారు. శనివారం కామారెడ్డిలోని దేవి విహార్‌లోని తన సొంత ఇంట్లోనే కమలాకర్ రావు చనిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్ రావు చాలా కాలం క్రితమే కామారెడ్డి పట్టణంలో స్ధిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పదేండ్ల క్రితమే కమలాకర్ రావు భార్య చనిపోయారు.
మేనమామ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన మేనమామతో తనకు చిన్న తనం నుంచి ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన బాల్యంలో చాలా సార్లు తాను మేనమామ ఇంటికే వెళ్లేవాడినని తెలిపారు.
కమలాకర్ రావు భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం కామారెడ్డిలోని దేవి విహార్‌లో ఉంచారు. అనంతరం సమీపంలోని స్మశానవాటికలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా నేపపథ్యంలో కమలాకర్ రావు అంత్యక్రియలకు కేసీఆర్ హాజరుకానట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2022 01:23PM