A brand new format for #IPL2022.
— SunRisers Hyderabad (@SunRisers) February 25, 2022
We will face all of the highlighted teams twice, and the others only once. #OrangeArmy #ReadyToRise pic.twitter.com/XUa7NC73A6
హైదరాబాద్ : ఈ ఏడాది ఐపీఎల్ నూతన విధానంలో జరగనుంది. ఇప్పటివరకు 8 జట్టు మాత్రమే ఉండడంతో ప్రతీ జట్టు ఇతర ఏడు జట్లతో రెండేసి సార్లు మ్యాచ్ ఆడేది. అయితే ఇప్పుడు 10 ఐపీఎల్ జట్లు కావడంతో టోర్నీ విధానంలో బీసీసీఐ మార్పులు తీసుకొచ్చి రెండు గ్రూపులుగా విభజించింది. ప్రతీ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుందని, ఒక్కో జట్టు ఐదు జట్లతో రెండుసార్లు, మిగిలిన నాలుగు జట్లు ఒక్కసారి మాత్రమే ఆడతాయి. దీన్ని నిర్ధారించడానికి, గెలిచిన ఐపీఎల్ చాంపియన్‌షిప్‌ల సంఖ్య, ఫైనల్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా నిర్ణయించిన సీడింగ్ సిస్టమ్ ఆధారంగా 10 జట్లను రెండు వర్చువల్ గ్రూపులుగా విభజించారు.
ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని జట్లతో రెండుసార్లు, ఇతర గ్రూప్‌లోని అదే వరుసలో ఉన్న జట్టుతో ఆడుతుంది. ఇతర గ్రూపులోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో జట్టు ఒక్కసారి మాత్రమే ఆడుతుంది.
ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై మే 29న ముగుస్తుందని, ముంబై, పూణెలోని నాలుగు వేదికల్లో 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతీ జట్టు వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో ఒక్కొక్కటి 4 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ స్టేడియం, ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3 మ్యాచ్‌లు ఆడుతుంది.