హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మార్చి 6న ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. అందులో రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సభ ఎన్నిరోజులు జరగాలనే అంశంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ రెండవ శాసనసభ 8 వ సమావేశం 2021 అక్టోబరు 8 వ తారీఖు నాడు ప్రోరోగ్ కాకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ని కౌన్సిల్ ను కలిపి ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు. ఉభయ సభల సంయుక్తం సమావేశం లేనందున గవర్నర్ ప్రసంగం కూడా ఉండే అవకాశం లేదు.
ఒక వేళ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, అవి ప్రోరోగ్ అయినప్పుడు మాత్రమే, తరువాతి సెషన్ లో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఇది రాజ్యాంగం ఆమోదించిన ప్రక్రియ. ఈ పద్దతి గతంలో పలు రాష్ట్రాల చట్టసభలు అనుసరించిన దాఖలాలున్నాయి.
గతేడాది 20-21 బడ్జెట్ సమావేశాల సందర్బంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో అక్కడి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2020 లో కిరణ్ బేడీ గవర్నర్ గా ఉన్న పాండిచ్చేరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నడిచాయి. గవర్నర్ కిరణ్ బేడీ స్వయంగా ప్రసంగాన్ని బహిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 1970 లో., ఆ తర్వాత 2014 లో తెలంగాణ ఏర్పడక ముందు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశం సాగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Feb,2022 06:30PM