హైదరాబాద్ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.720 మేర పెరిగి రూ. 51,280కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.660 పెరిగి రూ. 47,000కు చేరింది. వెండి రేటు కూడా ఏకంగా రూ.900 పెరుగుదలతో రూ. 69,900 చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm