హైదరాబాద్ : దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని.. ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం రాంచీలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం ఇరువురు సీఎంలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హేమంత్ సోరేన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏండ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్నారు. దేశంలో కొత్త దిశా నిర్దేశం కావాలని, దేశం మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని చెప్పారు. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచిస్తున్నామని తెలిపారు. తమది ఏ ఫ్రంటో తర్వాత చెబుతామన్నారు. త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm