హైదరాబాద్ : ములుగు జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రిగట్టమ్మ వద్ద ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతిచెందిన వారిని మంగపేట మండలం కోమటిపల్లి వాసులు అజయ్, కిరణ్, కౌసల్య, వసంత వెన్నెల, ఆటో డ్రైవర్ జానీలుగా గుర్తించారు. ప్రస్తుతం గొల్గబోయిన రసూల్‌తో అతని భార్య పద్మలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm