హైదరాబాద్ : రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ పై గత పది రోజులుగా దాడులకు పాల్పడుతున్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఆ దేశంలోని మారియుపోల్, వోల్నోవాఖా నగరాల్లో పౌరులను సురక్షితంగా తరలించేందుకుగానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపి వేస్తాయని రష్యా వెల్లడించింది. మానవతా సాయం కింద పౌరులను తరలించేందుకు రష్యా అవకాశం కల్పించింది.
Mon Jan 19, 2015 06:51 pm