హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. త్రోట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స అందిస్తున్నారు. అయితే కందికొండ చికిత్సకు భారీగా డబ్బులు ఖర్చు కావడంతో ఆయన కుటుంబం.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. గతేడాది కందికొండ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి తక్షణ సాయం కింద రూ. 2.50 లక్షలు అందేలా చూశారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు.
కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఆయనను సినీ రంగానికి పరిచయం చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కొందికొండ కొన్ని వందల పాటలు రాశారు. ఇడియట్, సత్యం, పోకిరి వంటి హిట్ చిత్రాల్లో కందికొండ పలు పాటలు రాశారు. 2018లో చివరి సారిగా నీది నాది ఒకే కథ చిత్రంలో రెండు పాటలు రాశారు. అలాగే బతుకమ్మ పాటలను ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 12 Mar,2022 05:17PM