హైదరాబాద్ : ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. వారు మళ్లీ సమ్మె వంటి పొరపాట్లు చేయవద్దని సూచించారు. సెర్ప్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఉంటాయన్నారు.
రెండేండ్ల కిందట బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, జీవో నెం.4779 రద్దు చేయాలన్న డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వారిని తెలంగాణ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Mar,2022 03:10PM