బ్రూసెల్స్ (బెల్జియం) : 30 ఏండ్ల క్రితం ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు తనను అవమానించారని ఓ ఉపాధ్యాయురాలిని ఓ వ్యక్తి 101 సార్లు పొడిచి చంపాడు. 2020లో బెల్జియంలో ఈ హత్య జరగ్గా.. గుంటర్ ఉవెంట్స్ (37) తాజాగా తన నేరాన్ని అంగీకరించాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. 1990 ప్రారంభంలో నిందితుడికి ఏడేండ్ల వయస్సు ఉండి పాఠశాల విద్యార్ధిగా ఉన్న సమయంలో... తనను టీచర్ మారియా వెర్లిండెన్ తీవ్రంగా తిట్టారని నిందితుడు వాంగ్మూలమిచ్చినట్టు చెప్పారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక. 2020లో ఆంటెవెర్స్ సమీపంలో ఉన్న హెరెంటల్స్‌లో ఉన్న ఉపాధ్యాయురాలిని ఆమె నివాసంలోనే దారుణంగా హత్య చేశాడు. 101 సార్లు కత్తితో పొడవడంతో టీచర్ చనిపోయారు. కానీ డైనింగ్ టేబుల్ మీద డబ్బులున్న పర్సు అలా ఉండటంతో .. ఇది దోపిడీ హత్య కాదని భావించిన పోలీసులు .. నిందితుడు కోసం గాలించారు. అనుమానితుల డిఎన్‌ఎలను పరిష్కరించినా నిందితుడు దొరకలేదు. చివరకు ఆమె భర్త .. ఈ హత్య ఎవరైనా చూస్తే చెప్పాలంటూ సాక్షుల కోసం బహిరంగ విజ్ఞప్తి చేశారు. అయితే నిందితుడు.. ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో.. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అవమానం తట్టుకోలేక 30 ఏండ్ల తర్వాత ఆమెను హత్యచేసినట్టు నిందితుడు అంగీకరించాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm