📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
ముంబై : ఐపీఎల్ 2022 ఆరంభానికి రెండు రోజుల ముందు మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. జట్టు సారథ్య బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించనున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ సోషల్మీడియా ద్వారా తెలిపింది.
ధోనీ 2008 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి సారథ్యంలో 12 సీజన్లు ఆడిన సీఎస్‌కే 11 సార్లు ప్లేఆఫ్స్ చేరింది. అత్యధికంగా 9సార్లు ఫైనల్ ఆడి, నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. ఇలా ధోని ఒక్కసారిగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ధోనీ, సీఎస్‌కే అభిమానులు షాక్ కు గురయ్యారు.