హైదరాబాద్ : ఆర్టీసీ ప్రయాణికులకు మళ్లీ షాక్ తగిలింది. ఇటీవలే చిల్లర సమస్య తీర్చేందుకు రౌండప్ పేరిట ఛార్జీలను సవరించిన ఆర్టీసీ తాజాగా మరోసారి ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచినట్టు చెప్పారు. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm